Pawan Kalyan: 'పవన్ కల్యాణ్ దేవుడు' అంటే మెంటల్ డాక్టరే దిక్కు: కత్తి మహేశ్

  • అభిమానుల్లో ఉన్మాదం పెరుగుతోంది
  • తెరపై మాత్రమే హీరోలు
  • జనసేనలో పవన్ తప్ప ఎవరున్నారు?
  • సైనికులను చూపడం లేదన్న కత్తి మహేశ్

ఎవరైనా తల్లిదండ్రులు, తమ బిడ్డ నోటి నుంచి 'పవన్ కల్యాణ్ దేవుడు' అన్న మాటను వింటే, వెంటనే వారిని మెంటల్ డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాలని వివాదాస్పద విశ్లేషకుడు కత్తి మహేశ్ వ్యాఖ్యానించాడు. సినీ నటుడు కేవలం నటించే వ్యక్తి మాత్రమేనని, కథ రాసేవాళ్లు కథ రాస్తారని, డ్యాన్స్ చేయించే వాళ్లు డ్యాన్స్ నేర్పుతారని, దర్శకత్వం మరొకరు చేస్తారని, హీరో కేవలం తెరపై మాత్రమే కనిపిస్తాడని, అటువంటి వ్యక్తి దేవుడని అంటే పిచ్చి పట్టుకున్నట్టే భావించాలని అన్నాడు.

పవన్ ను దేవుడిగా కొలుస్తున్న వాళ్లలో ఉన్మాదం ఎక్కువగా ఉన్నట్టని, ఇది సమాజానికి చెడు చేస్తుందని తెలిపాడు. మిగతా హీరోలతో పోలిస్తే పవన్ అభిమానుల్లో ఉన్మాదం అధికంగా కనిపిస్తోందని ఓ చానల్ నిర్వహించిన చర్చలో మహేష్ వ్యాఖ్యానించాడు. జనసేన పార్టీలో పవన్ తప్ప మరెవరూ లేరని, సేనలోని సైనికులు ఎవరో చూపించరని, వాళ్లపై ఒక్క కెమెరా కూడా ఫోకస్ కాదని ఆరోపణలు గుప్పించాడు.

Pawan Kalyan
katti mahesh
Fans
  • Loading...

More Telugu News