pawan kalyan: బీజేపీ, టీడీపీ, వైసీపీలకు పవన్ కల్యాణ్ సూచన!

  • జవాబుదారీతనం అంటే ఏమిటో ముందు బీజేపీ తెలుసుకోవాలి
  • లంచాలు తీసుకోలేదు కాబట్టే కేంద్రాన్ని నిలదీస్తున్నా
  • తప్పులు చేసినప్పుడు ఎదుటివారిని అడగలేము

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అకౌంటబిలిటీ (జవాబుదారీతనం) అంటే ఏమిటో ముందు బీజేపీ తెలుసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల తరపున తాను ప్రచారం నిర్వహించానని... అభ్యర్థుల గెలుపు కోసం ఉడతాభక్తి తనవంతు సహకారం అందించానని... కొందరు ఒక శాతం ఓట్ల తేడాతో కూడా గెలుపొందారని గుర్తు చేశారు.

వీరిలో ఎవరు పని చేయకపోయినా తాను బాధ్యత వహిస్తానని... అలాగే మీరు ఇచ్చిన మాటకు కూడా మీరు జవాబుదారీగా ఉండాలంటూ బీజేపీని డిమాండ్ చేశారు. తాను లంచాలు తీసుకోలేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని, ప్రధానితో కనీసం ఫొటో కూడా దిగలేదని... అందుకే కేంద్రాన్ని ధైర్యంగా నిలదీస్తున్నానని చెప్పారు.

నైతిక బలం నిష్పత్తి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీసి అడగలేవని అన్నారు. తప్పులు చేసినప్పుడు ఎదుటివారిని అడగలేమని చెప్పారు. టీడీపీ, వైసీపీలు హామీలను మర్చిపోవచ్చు కానీ... జనసేన మర్చిపోదని అన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు ప్రత్యేకహోదాను చిన్న విషయంగా భావించాయని... అకౌంటబిలిటీ లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. స్పెషల్ స్టేటస్ కోసం అన్ని పార్టీలు కలసి పని చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News