robo: '2.ఓ' విడుదల జాప్యానికి కారణం వీఎఫ్ఎక్స్ సంస్థ... దావా వేసిన నిర్మాతలు!
- అనుకున్న సమయానికి సినిమాను అందజేయలేకపోయిన సంస్థ
- అకాడమీ అవార్డు కూడా అందుకున్న వీఎఫ్ఎక్స్ సంస్థ
- తమని మోసం చేసిందని ఆరోపిస్తున్న నిర్మాతలు
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్‌లు నటించిన '2.ఓ' చిత్ర విడుదల జాప్యానికి కారణం తెలిసింది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఓ అమెరికన్ సంస్థకు లైకా ప్రొడక్షన్స్ అందజేసింది. వారు సకాలంలో వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయలేకపోవడంతో విడుదలలో జాప్యం కలిగినట్లు తెలుస్తోంది.
అయితే సంస్థ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాతలు దానిపై దావా వేశారట. అకాడమీ అవార్డు అందుకున్న ఆ సంస్థ తమను మోసం చేసిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఆ సంస్థ జాప్యం చేసి ఉండకపోతే ఈపాటికి సినిమా కూడా విడుదలై ఉండేదని వారు చెబుతున్నారు. ఎట్టకేలకు ఏప్రిల్‌లో విడుదల చేద్దామని భావించినప్పటికీ అప్పటికి కూడా పూర్తవుతుందో లేదోనన్న అనుమానంతో నిర్మాతలు దావా వేసినట్లు తెలుస్తోంది.