రామ్ చరణ్: ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా చరణ్.. ఫస్ట్ లుక్ విడుదల!
- ఫస్ట్ లుక్ విడుదల చేసిన రామ్ చరణ్
- ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర పోషిస్తున్న మెగా పవర్ స్టార్
- 2018 మార్చి 30న విడుదల కానున్న ‘రంగస్థలం’
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం ఫస్ట్ లుక్ కొంచెం సేపటి క్రితం విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘రంగస్థలం’లోని ‘చిట్టిబాబు’ను 2018 మార్చి 30న కలవండి!’ అని చెర్రీ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ద్వారా ‘రంగస్థలంలో’ చిట్టిబాబు పాత్రను చరణ్ పోషిస్తున్నట్టు స్పష్టమైంది. కాగా, ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది.