తెలంగాణ: తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు?

  • త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్
  • క్వార్టర్ బాటిల్ రూ.10 నుంచి రూ.25 వరకు పెరిగే అవకాశం
  • బీరు ధరల్లో మార్పు వుండదు 

తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 9 శాతం వరకు మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మద్యం ధరలు పెరిగితే.. ఆయా బ్రాండ్ లను అనుసరించి క్వార్టర్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.25 వరకు పెరుగుతుందని మద్యం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బీరు ధరలు మాత్రం పెరగవని చెబుతున్నారు.

మద్యం ధరలు కనుక పెరిగితే మందుబాబులకు మరింత ఖర్చు తప్పదు. ఈ సందర్భంగా తెలంగాణ మద్యం సరఫరాదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ, మద్యం ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిందని, వాటి ధరలు పెంచాలని తమ సంఘం ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాలని తెలంగాణ మద్యం, బీరు సరఫరాదారుల సంఘం గత రెండేళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. మద్యం ధరల పెంపు నిమిత్తం రెండేళ్ల క్రితం ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది.

  • Loading...

More Telugu News