ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి: జనవరి 7 నుంచి పోలవరంకు పాదయాత్ర: ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

  • ‘పోలవరం’ను త్వరగా పూర్తి చేయాలి 
  • ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు పాదయాత్ర  
  • జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు

పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ 2018 జనవరి 7 నుంచి 9 వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఈ పాదయాత్రను నిర్వహించనున్నట్టు తెలిపారు.

జనవరి 7వ తేదీ ఉదయం ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఈ పాదయాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, రైతుల భాగస్వామ్యంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో ఈ పాదయాత్ర తలపెట్టామని, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘పోలవరం’ ప్రాజెక్టు అంశంపై అన్ని పార్టీలతో కలిసి ఉభయసభలను స్తంభింపజేయాలని, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టమైన హామీని కేంద్రం నుంచి పొందాలని టీడీపీకి ఈ ప్రకటన ద్వారా సూచించారు.

  • Loading...

More Telugu News