పవన్ కల్యాణ్: పరకాల ప్రభాకర్ లాంటి సైడ్ ఆర్టిస్ట్ లను తిట్టేస్తే హీరో అనిపించుకోవు!: పవన్ కు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
- పవన్ ఎంత పిరికివాడో అర్థమైంది
- సినీ ఇండస్ట్రీలో అక్రమాలపై ముందుగా పోరాడు
- మీడియాతో అనిల్ కుమార్ యాదవ్
పరకాల ప్రభాకర్ లాంటి సైడ్ ఆర్టిస్ట్ లను తిట్టేస్తే పవన్ కల్యాణ్ హీరో అనిపించుకోరని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్లను పట్టుకుని ‘వదలను’ అని అనడంతో పవన్ ఎంత పిరికివాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోందని అన్నారు.
ముందుగా, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, మాఫియాపై పోరాడి, ఆ తర్వాత ప్రజల కోసం పోరాడాలని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు భయం లేదని, జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనంటున్నారని, ఆయనే కాదు తాము కూడా అందుకు సిద్ధమేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి అనవసరంగా అవాకులు చవాకులు పేలడం మంచి పద్ధతి కాదని, అటువంటి వ్యాఖ్యలు చేయకుండా మానుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.