కల్యాణ్‌రామ్: హీరో కల్యాణ్‌రామ్ కు షూటింగ్ లో గాయాలు!
- వికారాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా సంఘటన
- గాయపడ్డప్పటికీ సన్నివేశాన్ని పూర్తి చేసిన నటుడు
- పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఈరోజు షూటింగ్ లో పాల్గొన్న కల్యాణ్ రామ్
సినిమా షూటింగ్ లో ప్రముఖ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ గాయపడ్డాడు. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వికారాబాద్ లో గురువారం జరుగుతుండగా కల్యాణ్ రామ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర సమర్పకుడు మహేష్ కోనేరు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
కల్యాణ్ రామ్ గాయపడ్డప్పటికీ షూటింగులో పాల్గొని, సన్నివేశాన్ని పూర్తి చేశారని, పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఈరోజు షూటింగ్ పాల్గొన్నారని అన్నారు. వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకిత భావానికి ఇది నిదర్శనమంటూ ‘హ్యాట్సాఫ్’ చెప్పారు. కాగా, కల్యాణ్ రామ్ 15 వ చిత్రం జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కల్యాణ్ రామ్ సరసన తమన్నా నటిస్తోంది.