couple have 51 children: కన్నబిడ్డల్లేకపోయినా 51 మంది పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.. ఓ ఆదర్శ దంపతుల కథ!

  • సంతానానికి అవకాశం లేక దత్తత మార్గం
  • ఉత్తరప్రదేశ్ లో దంపతుల అపూర్వ సేవ
  • ఓ సంరక్షణ కేంద్రం, స్కూల్ సైతం నిర్వహణ

సృష్టి వారికి సంతాన భాగ్యాన్నివ్వలేదు. అయినా, వారిని పిల్లల యోగం పట్టుకుంది. ఏకంగా 51 మంది పిల్లలకు ఇప్పుడు ఆ దంపతులే తల్లిదండ్రులు. దీని గురించి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ కు వెళ్లి రావాల్సిందే.!

షామిలి ప్రాంతంలోని కుందన గ్రామానికి చెందిన మీనా రాణా (50), భాగ్ పత్ నివాసి వీరేందర్ రాణా (55) 1981లో వివాహం చేసుకున్నారు. మీనా గర్భసంచిలో ట్యూమర్ ఉన్నట్టు గుర్తించారు. దానివల్ల ఆమె స్వయంగా సంతానం కనే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. దాంతో ఈ దంపతులు షుక్రతాల్ కు నివాసం మార్చారు. ఓ ప్లాట్ కొనుగోలు చేసి 1990లో వైక్యలంతో బాధపడుతున్న ఏడాది వయసు బాలుడ్ని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఈ మూడు పదుల కాలంలో వారి ఆశ్రయం పొందిన వారి సంఖ్య 51కి చేరుకుంది.

వీరు షుక్రతాల్ లో ఓ సంరక్షణ కేంద్రాన్ని, చిన్న స్కూల్ ను కూడా నిర్వహిస్తున్నారు. కొందరికి వివాహమై, ఉద్యోగరీత్యా వెళ్లిపోగా, ఈ దంపతుల దగ్గర ప్రస్తుతానికి 46 మంది ఉంటున్నారు. వారి సంక్షేమం అంతా కూడా మీనా రాణా, వీరేందర్ రాణాలదే. బాధాకరమైన విషయం ఏమిటంటే 1990లో వారు దత్తత తీసుకున్న వికలాంగ బాలుడు ఐదేళ్ల తర్వాత మరణించడం. అతడికి వారు పెట్టుకున్న పేరు మంగేరామ్. ఆ బాధను దిగమింగి మరీ వారు మరింత మందిని చేరదీసి మానవత్వానికి పరిపూర్ణ రూపాలుగా నిలిచారు.


  • Loading...

More Telugu News