కేసీఆర్: ఇలాంటి పనులు ఎవరు చేస్తారో మీరే చెప్పండి?: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

  • ఆలుమగల మధ్య కొట్లాట పెడుతున్న కేసీఆర్
  • ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా?
  • సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్

తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముసలమ్మ, ముసలాయనకు పింఛన్ ఇచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, వాళ్లిద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే పింఛన్ ఇస్తున్నారని, ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 నలభై, నలభై ఐదేళ్ల పాటు సంసారం చేసిన ఆలుమగల మధ్య కొట్లాట పెడుతున్నారని.. కేసీఆర్ పని తీరు ఇదీ! అంటూ మండిపడ్డ రేవంత్, ‘ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? ఇలాంటి పనులు తాగుబోతోడు చేస్తాడో? మంచోడు చేస్తాడో? మీరే చెప్పండి’ అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పేదలకు భూములు, ఇళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News