Congress: విలేకరి మైకును లాక్కొని, విసిరిగొట్టిన కేంద్ర మాజీ మంత్రి.. మీరూ చూడండి!
- మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అభ్యంతరకర వ్యాఖ్యలు
- ఖండించిన రాహుల్ గాంధీ
- మళ్లీ మణిశంకర్ వద్దకు వెళ్లి స్పందన అడిగిన మీడియా
- ఇంగ్లిష్ ఛానెల్ విలేకరిపై సదరు నేత ఆగ్రహం
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్.. 2014 లో నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’ అంటూ హేళన చేశారు. తాజాగా ఆయన మరోసారి మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు వాస్తవ రూపం తేవడానికి జవహర్‌లాల్ నెహ్రూ కృషి చేశారని, అటువంటి కుటుంబంపై ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన నీచుడు, సభ్యత లేనివాడు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.
అయితే, ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. దీంతో మణిశంకర్ అయ్యర్ స్పందన కోసం మీడియా మళ్లీ వెళ్లింది. తనకు నచ్చిన మీడియాకి మాత్రమే వివరణ ఇచ్చిన మణి శంకర్ అయ్యర్.. ఓ ఇంగ్లిష్ వార్తా ఛానల్ విలేకరిపై మాత్రం మండిపడ్డారు. ఆ విలేకరిని తన వద్దకు రానివ్వలేదు. ఆ విలేకరి ముందుకు రాగా అతడు పట్టుకున్న మైకును లాక్కొని, విసిరేశారు. దీంతో ఆ విలేకరి తిరిగి మరో మైకును ఆయన వద్ద ఉంచగా, మణిశంకర్ అయ్యర్ మళ్లీ దురుసుగా ప్రవర్తించారు. ఆ మైకును కూడా విసిరిగొట్టారు. ఆయన అలా ప్రవర్తిస్తుండగా కెమెరాకు చిక్కిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
SHOCKING: Look how Mani Shankar Aiyar after calling PM @narendramodi ‘neech’ snatches mic from #Republic reporter Piyush Mishra and throws it away. Entire media watches as a journalist in heckled for asking uncomfortable questions. Will Aiyar apologies or live in denial forever? pic.twitter.com/CtlR6RUZcb
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 7, 2017