ప్రధాని: ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన రమణదీక్షితులు
- తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న టీటీడీ అధికారులు
- తన కుమారులను తిరుపతిలోని ఆలయాలకు బదిలీ చేయడం అన్యాయం
- లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన తిరుమల ప్రధాన అర్చకుడు
తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. టీటీడీ అధికారులు తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీకి, సీఎం చంద్రబాబుకు ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఫిర్యాదు చేశారు. తన కుమారులను తిరుమల నుంచి తిరుపతిలోని ఆలయాలకు బదిలీ చేయడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని, సీఎంకు ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.