rp patnaik: ఆ పెద్దాయన అలా అనడం వల్లే ఇక మ్యూజిక్ చేయడం మానేశాను!: ఆర్పీ పట్నాయక్

  • ఓ పెద్దాయన నన్ను అంతమాట అనేశారు
  • దాంతో నేను మ్యూజిక్ చేయడం మానేశాను 
  • ఈ సంఘటనతో నాగ్ కి ఎలాంటి సంబంధం లేదు  

కొంతకాలం క్రితం తన సంగీతంతో ఆర్పీ పట్నాయక్ యూత్ ను ఒక ఊపు ఊపేశారు. ఆయన సంగీతాన్ని అందించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అలాంటి ఆర్పీ పట్నాయక్ .. ఆ తరువాత మ్యూజిక్ చేయడం మానేశారు. నాగ్ హీరోగా చేసిన 'నేనున్నాను' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనే అందుకు కారణమనేది ప్రచారంలో వుంది. ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆర్పీ పట్నాయక్ కి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. "ఇంతవరకూ ఈ విషయాన్ని గురించి ఎక్కడా చెప్పలేదు. నేను మ్యూజిక్ చేయడం మానుకోవడానికి నాగార్జున కారణమనే టాక్ వుంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు .. నాగార్జున నిజంగా చాలా మంచి మనిషి. 'నేనున్నాను' సినిమాకి రెండు ట్యూన్స్ చేసిన తరువాత నేను యూఎస్ టూర్ కి వెళ్లవలసి వుంది. ఆ సమయంలో ఇంకొక సినిమా కూడా చేయాలని అన్నారు. ఆ టూర్ వలన నేను కుదరదని చెప్పాను .. దాని వలన హర్ట్ అయ్యారేమో"

"రామానాయుడు స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఒక పెద్దాయన వచ్చారు. 'నేనున్నాను' ప్రాజెక్టు నుంచి నన్ను తప్పించారని చెప్పడానికి ఆయన వచ్చారు. ఈ ప్రాజెక్టుకు నా అవసరం లేదు అని చెబితే నేను పెద్దగా బాధపడేవాడిని కాదు. కానీ ఆయన వచ్చి "మీ వల్ల మా సినిమా బిజినెస్ కావడం లేదండి .. అందుకే మిమ్మల్ని వద్దనుకుంటున్నాం" అన్నారు.

"నా లైఫ్ లో నేనెప్పుడూ అంత షాక్ కాలేదు. ఒక సినిమా బిజినెస్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ పై ఆధారపడి ఉంటుందా? అని ఆశ్చర్యం కలిగింది. ఆయన చెప్పిందే నిజమైతే మిగతా నిర్మాతలు కూడా నష్టపోతారు కదా అనిపించింది. అలా జరగకూడదనే మ్యూజిక్ చేయడం ఆపేశాను" అని చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News