Navy: లింగమార్పిడితో మహిళగా మారిన ఉద్యోగికి ప్రైవేటు ఉద్యోగం ఆఫర్ చేసిన నేవీ!

  • మహిళగా మారిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన నేవీ
  • కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఉద్యోగం చూపించిన నేవీ
  • అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగి తరపు న్యాయవాది

లింగమార్పిడితో మహిళగా మారిన తమ మాజీ ఉద్యోగికి బుధవారం నేవీ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాన్ని ఇప్పిస్తామని చెప్పింది. సైలర్‌‌గా ఉద్యోగంలో చేరిన అతడు ఇటీవల లింగమార్పిడి ద్వారా మహిళగా మారడంతో నేవీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. నేవీలో మహిళలకు ఉద్యోగాలు లేవన్న కారణంగా అతడిని విధుల నుంచి తప్పించడంతో అతడు (ఆమె) కోర్టును ఆశ్రయించాడు.

దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు నేవీలో ఆమె (అతడు)కి సరైన ఉద్యోగం లేనప్పుడు మంచి వేతనంతో ఏదైనా కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇప్పించాలని నేవీని ఆదేశించింది. స్పందించిన నేవీ బుధవారం ఆమె (అతడు)కి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చూపించింది. బుధవారం ఈ కేసు విచారణకు హాజరైన నేవీ మాజీ ఉద్యోగి తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ మాట్లాడుతూ నేవీలో తన క్లయింట్ అందుకుంటున్న వేతనం కంటే ప్రస్తుతం నేవీ ఆఫర్ చేసిన ఉద్యోగంలో వేతనం చాలా తక్కువ అని కోర్టుకు తెలిపారు. దీంతో కేసు తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News