suicide: గీతం యూనివ‌ర్సిటీలో క‌ల‌క‌లం.. 13వ అంత‌స్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌!

  • విద్యార్థి ఆత్మ‌హ‌త్యపై ఆరా తీస్తోన్న పోలీసులు
  • వ‌ర్సిటీలో బీ ఫార్మ‌సీ చ‌దువుతోన్న విద్యార్థి
  • మృతుడు హైద‌రాబాద్‌కు చెందిన శశికుమార్(19) గా గుర్తింపు

విశాఖ‌ప‌ట్నంలోని గీతం విశ్వ‌విద్యాల‌యంలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ విద్యార్థి గీతం క్యాంప‌స్‌లోని 13వ అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చ‌దువులో ఒత్తిడి కార‌ణంగానే ఆ విద్యార్థి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని స‌దరు విద్యార్థి ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు. ఆ విద్యార్థి వ‌ర్సిటీలో బీ ఫార్మ‌సీ చ‌దువుతున్నట్లు తెలిసింది. మృతుడు హైద‌రాబాద్‌కు చెందిన శశికుమార్(19) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.              

  • Loading...

More Telugu News