lunar probe: చంద్రుని మీద రోబో స్టేషన్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్న చైనా
- అక్కడి భౌగోళిక పరిస్థితుల అధ్యయనం
- సోలార్ పవర్ జనరేటర్ ఏర్పాటుకు యత్నం
- 2030లోగా మొదటి పేలోడ్ ప్రయోగం
చంద్రుని భౌగోళిక పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అక్కడ ఓ రోబో స్టేషన్‌ని ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఈ స్టేషన్ ఏర్పాటు వల్ల ప్రతి చిన్న శాంపిల్‌ను భూమ్మీదికి తీసుకువచ్చే అవసరం లేకుండా అక్కడే పరిశోధించే అవకాశం కలుగుతుందని పెకింగ్ యూనివర్సిటీ అధ్యాపకుడు జియో వీక్సిన్ తెలిపారు.
ఒక సోలార్ పవర్ జనరేటర్‌ను అక్కడ ఏర్పాటు చేస్తే, రోవర్లు అవసరం లేకుండానే చంద్రుని భౌగోళిక పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేసే అవకాశం కలగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి మొదటి క్యారియర్ రాకెట్‌ను 2030లోగా పంపేందుకు చైనా యోచిస్తోంది. అలాగే 2018లో `చాంగ్ఏ-4` పేరిట చంద్రుని మీది చీకటి భాగాన్ని పరిశోధించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది.