Hardhik Patel: రూ. 10 కోట్లు ఇస్తే, మోదీ, రూపానీ సెక్స్ సీడీలు బయటకు తెస్తా: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

  • ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్న నేతలు
  • తన రాసలీలల సీడీ నకిలీదని మరోసారి వాదించిన హార్దిక్
  • డబ్బులిస్తే, ఎవరినైనా మార్ఫింగ్ చేసి చూపిస్తానని వెల్లడి
  • బీజేపీవి దిగజారుడు రాజకీయాలని నిప్పులు

గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నేతల మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ప్రజలకు తామేం చేస్తామో చెప్పాల్సిన నేతలు, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి.. కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన హార్దిక్ పటేల్ వరకూ ప్రతి ఒక్కరూ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నవారే. తాజాగా హార్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, తన రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆ సీడీ నకిలీదని, మార్ఫింగ్ చేశారని చెబుతూ, తనకు ఓ పది కోట్ల రూపాయలు ఇస్తే, ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెక్స్ సీడీలను విడుదల చేస్తానని, కంప్యూటర్ లో గ్రాఫిక్స్ సాయంతో వారిని చొప్పించడం పెద్ద కష్టమైన పనేమీ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమే తనపై ఆరోపణలని వ్యాఖ్యానించిన ఆయన, ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇటువంటి పనులు చేస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు రాష్ట్రంలోని పటీదార్లు, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Hardhik Patel
Gujarath
Elections
Narendra Modi
Vijay Rupani
  • Loading...

More Telugu News