Narendra Modi: ప్రధాని మోదీని దాటేసిన కోహ్లీ.. ట్విట్టర్‌లో 61 శాతం పెరిగిన ఫాలోవర్లు!

  • ఈ ఏడాది గణనీయంగా పెరిగిన కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య
  • 20.8 మిలియన్లకు చేరుకున్న కోహ్లీ ఫాలోవర్లు
  • బాలీవుడ్‌లో షారూఖ్ కంటే వెనకబడిన సల్మాన్

భారత ప్రధాని నరేంద్రమోదీని టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అధిగమించాడు. ట్విట్టర్‌లో కోహ్లీని అనుసరించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది మోదీ ఫాలోవర్ల సంఖ్య 52 శాతం పెరగ్గా అదే సమయంలో కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 61 శాతం పెరిగింది. 2017 సంవత్సరానికి ట్విట్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మోదీ ఫాలోవర్ల సంఖ్య డిసెంబరు 4 నాటికి 52 శాతం పెరిగి 37.5 మిలియన్లకు చేరుకుంది. గతేడాది మోదీని 24.6 మిలియన్ల మంది మాత్రమే అనుసరించగా ఈ ఏడాది గణనీయంగా పెరిగింది.

ఈ ఏడాడి టీమిండియా సారథి కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 61 శాతం పెరిగింది. ట్విట్టర్ లెక్కల ప్రకారం.. గతేడాది కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 12.9 మిలియన్ల మందికాగా ఈ ఏడాది అది 20.8 మిలియన్లకు చేరుకుంది. సచిన్ టెండూల్కర్‌ ఫాలోవర్ల సంఖ్య 56 శాతం పెరిగింది. ఎక్కువమంది అనుసరిస్తున్న టాప్-10 ట్విట్టర్ ఖాతాల్లో కోహ్లీ, సచిన్‌లు తొలిసారి స్థానం దక్కించుకున్నారు. ఈ విషయంలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు.  

బాలీవుడ్ నటుల్లో అమితాబ్, షారూఖ్, సల్మాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, దీపికా పదుకొణె, హృతిక్ రోషన్‌లు ఉన్నారు. షారూఖ్‌ను 30.9 మిలియన్ల మంది అనుసరిస్తుండగా  సల్మాన్ ఫాలోవర్ల సంఖ్య 28.5 మిలియన్లు.

  • Loading...

More Telugu News