బాబ్రీ మసీదు: ఆ సంఘటన భారత జాతి గుండెను ముక్కలు చేసింది: లాలూ ప్రసాద్ యాదవ్
- ఆ గాయాలు ఇప్పటికీ మానలేదు
- మితవాద శక్తుల కుట్ర ఫలితమే నాటి సంఘటన
- మీడియాతో లాలూ ప్రసాద్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగి ఇరవై ఐదేళ్లు. ఈ సందర్భంగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన భారతజాతి గుండెను ముక్కలు చేసిందని, ఆ గాయాలు ఇప్పటికీ మానలేదని అన్నారు.
బీసీల అభివృద్ధిని అడ్డుకునేందుకు మితవాద శక్తుల కుట్ర ఫలితమే నాటి బాబ్రీ మసీదు విధ్వంస సంఘటనని ఆరోపించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై మండల్ కమిషన్ సిఫారసులను నాడు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ విషయంలో వెనుకబడిన వర్గాల దృష్టిని మళ్లించేందుకే బాబ్రీ మసీదు విధ్వంసానికి బీజేపీ నేతలు పాల్పడ్డారని లాలూ ఆరోపించారు.