declared: ఢిల్లీ టెస్టు: భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. 246/5
- శ్రీలంక విజయలక్ష్యం 410 పరుగులు
- మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ పరుగులు-536
- మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక పరుగులు-373
- రెండో ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీలు చేసిన ధావన్, కోహ్లీ, రోహిత్
ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచు మొదటి ఇన్సింగ్సుని టీమిండియా 536 పరుగులకి డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 373 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 246 పరుగులకే డిక్లేర్ చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ 7, శిఖర్ ధావన్ 67, రహానె 10, పుజారా 49, కోహ్లీ 50, రోహిత్ శర్మ 50 (నాటౌట్), రవీంద్ర జడేజా 4 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్, గమేజ్, పెరెరా, ధనంజయ, శాందనక్ ఒక్కో వికెట్టు చొప్పున తీశారు. శ్రీలంక విజయలక్ష్యం 410 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.