ayodhya: అయోధ్య‌ వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు.. తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా!

  • లోక్‌స‌భ ఎన్నిక‌లు అయ్యేవరకు తీర్పును వాయిదా వేయాల‌న్న వినతిని తోసిపుచ్చిన‌ కోర్టు
  • ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు జడ్జిల బెంచ్ విచార‌ణ‌
  • 2010లో అల‌హాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కొన‌సాగుతోన్న వాద‌న‌లు

అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కొన‌సాగుతోంది. సున్నీ వ‌క్ఫ్ బోర్డు త‌ర‌ఫున క‌పిల్ సిబ‌ల్ వాద‌న‌లు వినిపించారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్ర‌భావితం చేస్తుంద‌ని, అందువల్ల అయోధ్య భూ వివాద తీర్పును 2019 జులై వ‌ర‌కు వాయిదా వేయాల‌ని సున్ని వ‌క్ఫ్ బోర్డు త‌ర‌ఫు లాయర్ క‌పిల్ సిబాల్ చేసిన విన‌తికి సుప్రీంకోర్టు నిరాక‌రించింది.

ఈ కేసులో విచార‌ణ‌కు ఏడుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన‌ విస్తృత రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఏర్పాటు చేయాల‌ని అడ్వ‌కేట్లు క‌పిల్ సిబ‌ల్‌, రాజీవ్ ధావ‌న్‌ల‌తో పాటు ఇతర పిటిష‌న‌ర్ల న్యాయ‌వాదులు కోరారు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. ఈ కేసులో ఈ రోజు వాద‌నలు ముగిశాయి. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే ఏడాది ఫ్రిబ్ర‌వ‌రి 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
 
కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై విచారించిన అలహాబాద్ హైకోర్టు 2.77 ఎకరాల చొప్పున సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహీ అఖారా, రామ మందిరాలకు కేటాయించాలని 2010లో తీర్పును ఇచ్చింది. అయితే, ఆ తీర్పుపై 13 అప్పీళ్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. 

  • Loading...

More Telugu News