జగన్: జగన్ స్క్రిప్ట్ ను ఉండవల్లి చదువుతున్నారు: టీడీపీ నేత లంకా దినకర్
- కాంట్రాక్టర్ల ద్వారా లబ్ది పొందిన జగన్ కేసులు ఎదుర్కొంటున్నారు
- తండ్రి మరణించిన సమయంలోనూ కాంట్రాక్టు కోసం అర్రులు చాచలేదా?
- విమర్శలు గుప్పించిన దినకర్
వైసీపీ అధినేత జగన్ స్క్రిప్ట్ ను సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ చదువుతున్నారని టీడీపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల ద్వారా లబ్ది పొందిన జగన్ కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నారని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలోనూ పోలవరం పవర్ కాంట్రాక్టు కోసం జగన్ అర్రులు చాచలేదా? అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం నిర్వాసితులకు కేవలం రూ.3 వేల కోట్ల పరిహారం ఇవ్వకపోవడంతో, నేడు రూ. 34 వేల కోట్ల పరిహారం ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.