hindusthan: 'హిందుస్థాన్ జిందాబాద్' అంటూ రాసిన పాకిస్థానీ యువ‌కుడు.. అరెస్టు చేసిన పోలీసులు!

  • ఇంటిగోడ మీద రాసిన సాజిద్ షా
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • జాతి వ్య‌తిరేకి అనే నెపంతో అరెస్టు

'హిందూస్థాన్' అనే ప‌దం మీద ప్రేమ‌తో పాకిస్థాన్‌లోని నార అమ‌జై ప్రాంతానికి చెందిన సాజిద్ షా అనే యువ‌కుడు త‌న ఇంటి గోడ మీద 'హిందూస్థాన్ జిందాబాద్' అని రాశారు. ఇది చూసిన స్థానికులు ఆ రాత‌ల‌ను తుడిపేయాల‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ సాజిద్ విన‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్క‌డికి విచ్చేసిన ఖైబ‌ర్ ప‌ఖ్తుంఖ్వా పోలీసులు పాకిస్థాన్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 505 ప్ర‌కారం జాతి వ్య‌తిరేక నేరం కింద సాజిద్‌ను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News