Jayalalitha: జయలలిత నాన్నను చంపింది స్వయంగా వాళ్ల అమ్మే!: సంచలన వ్యాఖ్యలు చేసిన జయలలిత అత్త లలిత

  • ఓ తమిళ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లలిత
  • మద్యానికి బానిస కావడంతో భర్తకు విషం పెట్టి చంపిన సంధ్య
  • అమృతే జయ కుమార్తె అనడానికి ఆధారాలు లేవు
  • ఆడ బిడ్డ పుట్టిందన్న మాట మాత్రం వాస్తవం: లలిత

తన మరణానంతరం కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జీవితంలోని మరో సంచలన విషయాన్ని ఆమె అత్త లలిత వెలుగులోకి తెచ్చారు. ఓ తమిళ చానల్ తో మాట్లాడిన ఆమె, జయలలిత తండ్రి జయరామన్ మద్యానికి బానిస కావడంతో, తల్లి సంధ్యే స్వయంగా విషమిచ్చి చంపిందని ఆరోపించారు. జయరామన్ హత్య తరువాత ఆమె ఈగోను భరించలేక తాము ఆమెకు దూరంగా వెళ్లిపోయామని, ఆ తరువాత జయ ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళ్లిందని అన్నారు.

సినీ నటి అయిన సంధ్య జయలలితను నటనవైపే ప్రోత్సహించిందని గుర్తు చేసుకున్నారు. జయకు కాన్పు చేసింది తన పెద్దమ్మేనని, అయితే, పుట్టిన బిడ్డ అమృతేనని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేవని అన్నారు. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ఒట్టు వేయించుకుందని లలిత వెల్లడించారు. కాగా, జయలలిత మరణం తరువాత ఒకదాని వెంట ఒకటి వరుసగా వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Jayalalitha
Lalitha
Amrutha
Tamilnadu
  • Loading...

More Telugu News