Sharad Yadav: సంచలనం: రాజ్యసభ సభ్యులు శరద్ యాదవ్, అలీ అన్వర్‌లపై అనర్హత వేటు!

  • ఆర్జేడీతో చేతులు కలిపి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేతలు
  • జేడీయూ ఫిర్యాదు..
  • వేటేసిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు

జేడీయూ రెబల్ నేతలు, రాజ్యసభ సభ్యులు శరద్ యాదవ్, అలీ అన్వర్‌లపై వేటు పడింది. జేడీయూలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సొంత పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఉప రాష్ట్రపతి, రాజసభ చైర్మన్ అయిన వెంకయ్యయనాయుడు వారిని అనర్హులుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వీరు ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు.

తమదే నిజమైన జేడీయూ అని నితీశ్‌కు ఎదురు తిరిగారు. దీంతో సీఎం వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. విచారణ అనంతరం నితీశ్ వర్గానిదే అసలైన జేడీయూ అని ఎన్నికల సంఘం గుర్తించింది. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఫిర్యాదుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వీరిని అనర్హులుగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News