google chrome: క్రోమ్ బ్రౌజర్లో హెచ్డీ వీడియోలు... త్వరలో అందుబాటులోకి కొత్త ఫీచర్
- ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రత్యేకం
- వెబ్సైట్లో వీడియోలకు హెచ్డీఆర్ ప్లేబ్యాక్ సపోర్ట్
- ప్రస్తుతం ప్రయోగస్థాయిలో ఉన్న ఫీచర్
త్వరలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా మాత్రమే హెచ్డీ వీడియోలు చూసుకునే సదుపాయం ఉండేది. అలా కాకుండా క్రోమ్ బ్రౌజర్‌కి కూడా హెచ్డీఆర్ వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ ఫీచర్‌ను జోడించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగస్థాయిలో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీని ద్వారా అన్ని రకాల వెబ్సైట్లలోని వీడియోలను కూడా హెచ్డీ క్వాలిటీతో ప్లే చేసే సదుపాయం కలగనుంది. ఈ ఫీచర్ కేవలం హెచ్డీ సపోర్ట్ టెక్నాలజీ ఉన్న ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.