shiva prasad: పార్టీ మారుతున్నానన్నది దుష్ప్రచారం మాత్రమే!: ఎంపీ శివప్రసాద్

  • కులం కోసం ఏం చేశారని ఎస్సీలంతా నిలదీశారు, అందుకే అలా అన్నాను 
  • పార్టీ మారేది లేదు
  • చంద్రబాబుతో నాకు గ్యాప్ రాదు

పార్టీ మారుతున్నానని, పార్టీలో ఆనందంగా లేనని.. వస్తున్న వార్తలన్నీ తానంటే ఇష్టపడని వారు చేసే ప్రచారమని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. '10 టీవీ'తో ఫేస్ టు ఫేస్ లో ఆయన మాట్లాడుతూ, తాను చేసిన మంచి పనులతో వస్తున్న పేరును చూసి, ఆందోళన చెందినవారు చేస్తున్న ప్రచారమని అన్నారు. చంద్రబాబుకి, తనకు మధ్య గ్యాప్ రాదని ఆయన చెప్పారు. గతంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కులం కోసం ఏం చేశారని ఎస్సీలంతా తనను నిలదీశారని, ఆ నేపథ్యంలోనే తాను అలా స్పందించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

తిరుపతిలో మెజారీటీ భూములు హథీరాంజీ మఠానికి చెందినవని అన్నారు. ఆ భూములను పలువురు ఎస్సీలు, రైతులు కౌలుకి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఆ భూముల విషయంలో తమను గతంలో పట్టించుకోలేదని, దీంతోనే తాను సీఎంను చూడమని మాట్లాడానని ఆయన చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు? పీహెచ్డీ చేస్తున్నవారికి స్కాలర్ షిప్ లు ఎందుకు ఇవ్వడం లేదు? అని అడిగానని ఆయన అన్నారు. 

shiva prasad
Telugudesam mp
  • Loading...

More Telugu News