adhar-pan: ఈ నెలతో ముగియనున్న ఆధార్-పాన్ అనుసంధానం గడువు.. మరోసారి గడువు పెంచే యోచన!
- గడువును మరో మూడు నుంచి ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం
- ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోతే పాన్ నంబర్లు రద్దు
- అనుసంధానం చేసుకుంటే నకిలీ పాన్ నంబర్లు రద్దు
- ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారి వెల్లడి
ఆధార్-పాన్ కార్డుల అనుసంధానానికి ఈ నెల 31తో గడువు ముగియనుంది. అయితే, ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేసుకోలేదు. దీంతో ఆధార్-పాన్ కార్డుల అనుసంధానం గడువును కేంద్ర సర్కారు మరోసారి పెంచనున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తాజాగా మాట్లాడుతూ... ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి గడువును మూడు నుంచి ఆరు నెలల వరకు పెంచే అవకాశం ఉందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న మరో అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోతే పాన్ నంబర్లు రద్దు అవుతాయని తెలిపారు. ఆధార్-పాన్ అనుసంధానం చేసుకుంటే నకిలీ పాన్ నంబర్లు రద్దు అవుతాయని, బినామీ లావాదేవీలను కూడా అరికట్టవచ్చని అన్నారు.