Undavalli Arunkumar: మోదీకి పెళ్లాం పిల్లలు లేరు... చంద్రబాబుపై పగ తీర్చుకునే తీరుతారు: ఉండవల్లి సంచలన వ్యాఖ్య

  • గతంలో మోదీ హైదరాబాద్ కు వస్తే అరెస్ట్ చేయిస్తానని చెప్పిన చంద్రబాబు
  • అధికారం, రాజకీయం మాత్రమే మోదీ అస్త్రాలు
  • ఆయన మనసులో చంద్రబాబు వ్యాఖ్యలు ఉండే ఉంటాయి
  • మోదీ అంటే చంద్రబాబు భయపడటానికి కారణమిదే!

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, నరేంద్రమోదీ హైదరాబాద్ లో కాలు పెడితే అరెస్ట్ చేయిస్తానని చేసిన వ్యాఖ్యలను ఓ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మోదీపై అంత పరుష పదజాలాన్ని వాడలేదని చెప్పిన ఆయన, "మోదీ అన్నవాడికి పెళ్లాం పిల్లలు లేరు. తల్లీ లేదు. తండ్రి లేడు. ఓన్లీ రాజకీయం, అధికారమే. అతను చంద్రబాబు వ్యాఖ్యలను మరచిపోతాడని నేను అనుకోను. కచ్చితంగా అదే ఈయనకి నాటుకుని ఉంది. మోదీని చేయడానికి చంద్రబాబు వద్ద ఏమీలేదు. కరెప్షన్ లో అతనిపై ఏమీ పెద్దగా చార్జెస్ లేవు.  మనకేమో ఒళ్లంతా చార్జీలే. అందుకే భయపడుతున్నాడా? అసలు చంద్రబాబునాయుడు భయపడటానికి హేతుబద్ధమైన కారణం నాకు ఇంతవరకూ కనిపించలేదు" అని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

ఆయన పగ తీర్చుకునే తీరుతారని అనుకొంటున్నట్టు చెప్పారు. బీజేపీకి ఓ ఫిలాసఫీ ఉందని, హిందుత్వ అన్న వాదనలోనే ముందుకు సాగుతోందని, గుజరాత్ లో అధికారాన్ని నిలుపుకోవడానికి అమిత్ షా, మోదీలు ఎంతకైనా తెగిస్తారని అన్నారు. రాజ్యం వీరభోజ్యం అన్నట్టు అధికారం కోసం, తాము చేసింది తప్పని వీరు ఎన్నడూ ఒప్పుకోబోరని తెలిపారు. వాళ్లకు ఏపీపై ఎలాంటి ఇంట్రస్టూ లేదని, వారి ప్రయోజనాల కోసం వారు చూస్తుంటే, మనం ఎందుకు లొంగి ఉండాలన్నదే చంద్రబాబుకు తన సూటి ప్రశ్నని తెలిపారు.

Undavalli Arunkumar
Chandrababu
Telugudesam
Narendra Modi
  • Loading...

More Telugu News