OU: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య...ఉద్రిక్తత

  • ఓయూలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి
  • మానేరు హాస్టల్ రూం నెంబర్ 159లో ఆత్మహత్య
  • సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల్ దౌలాపూర్ కు చెందిన మురళి

ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ లో రూమ్ నెంబర్ 159లో మురళి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మురళి స్వస్థలం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని దౌలాపూర్. నిరుద్యోగ సమస్యే మురళి ఆత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపిస్తుండగా.. చదువులో ఒత్తిడితోనే మురళి ఆత్మహత్య చేసుకున్నాడని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ సూసైడ్ నోట్ ను అతని స్నేహితులు కూడా చదివారని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మానేరు హాస్టల్ కు విద్యార్థి సంఘాల నేతలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ సమస్య కారణంగా ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని మృతికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మురళి మృతదేహాన్ని చూసేందుకు రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఓయూకు వెళ్లారు. దీంతో అక్కడ విద్యార్థులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. 

OU
osmania university
student sucide
  • Loading...

More Telugu News