anchor ravi: సెన్సేషన్ క్రియేట్ చేస్తేనే గుర్తింపు వస్తుంది: యాంకర్ రవి

  • ఇది మా ప్రేమ కథ' సినిమాతో అరంగేట్రం చేస్తున్న యాంకర్ రవి
  • లాస్యతో కంఫ్టర్ జోన్ ఉండేది
  •  శ్రీముఖితో కొంచెం ఎక్కువ కంఫ్టర్ జోన్

సెన్సేషన్ క్రియేట్ చేస్తేనే గుర్తింపు వస్తుందని యాంకర్ రవి అభిప్రాయపడ్డాడు. తను హీరోగా అరంగేట్రం చేస్తున్న 'ఇది మా ప్రేమ కథ' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయని అన్నాడు. తనకు పెళ్లయిందా? లేదా? అన్నది తన పర్సనల్ అంశమని, దానిని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత తన గురించి చెప్పాలనిపించిందని, అయితే టాపిక్ డైవర్ట్ అవుతుందని చెప్పలేదని అన్నాడు. లాస్యతో తనకు కంఫర్ట్ జోన్ ఉండేదని, ఇప్పుడు శ్రీముఖితో కూడా కంఫర్ట్ జోన్ ఉందని చెప్పాడు. అయితే శ్రీముఖితో అది కొంచెం ఎక్కువని తెలిపాడు. శ్రీముఖిని తానేదైనా అంటే పట్టించుకోదని, అలాంటప్పుడు ఇతరులు ఏమన్నా పట్టించుకోవాల్సి అవసరం లేదని, తాను పట్టించుకోనని రవి అన్నాడు. 

anchor ravi
new movie
idi maa prema katha
  • Loading...

More Telugu News