Okkhi: మహారాష్ట్ర వైపు దూసుకొస్తున్న ఓఖి... గోదావరికి మళ్లీ జలకళ!

  • ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఓఖి
  • దిశ మార్చుకుని మహారాష్ట్ర వైపు పయనం
  • కర్ణాటకలోనూ వర్షాలు కురిసే అవకాశం
  • గోదావరి, కృష్ణమ్మలకు నీరు వచ్చే చాన్స్

అరేబియా సముద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగుతున్న ఓఖి తుపాను, దిశ మార్చుకుని నెమ్మదిగా మహారాష్ట్ర, గుజరాత్ వైపు పయనిస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను మహారాష్ట్ర వద్ద తీరాన్ని దాటితే, గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో కర్ణాటకలోని కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో సైతం చెప్పుకోతగ్గ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు. కాగా, ఓఖి ప్రభావం లక్ష ద్వీప్ పై అధికంగా ఉంది. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, దాదాపు 20 మంది వరకూ మృత్యువాత పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మొత్తం 117 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం భారత నేవీ, ఎయిర్ ఫోర్స్, తీర రక్షక దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

  • Loading...

More Telugu News