cannaught place: పట్టపగలు న్యూఢిల్లీ, కన్నాట్ ప్లేస్... యువతిని వేధిస్తూ, చెత్తపని చేసిన వ్యక్తి!

  • భోజన విరామ సమయంలో టెర్రెస్ పైకి వెళ్లిన టీచర్
  • అటకాయించి వేధించిన వ్యక్తి
  • సీసీటీవీలో స్పష్టంగా కనిపించని ముఖం

ఓ మహిళా టీచర్ మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఫోన్ మాట్లాడుతూ స్కూలు టెర్రెస్ పైకి వెళ్లిన వేళ, అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను వేధిస్తూ, చెత్తపని చేయడంతో పాటు ఆమె ఫోన్ ను బలవంతంగా లాక్కుని వెళ్లిన ఘటన అత్యంత బిజీగా ఉండే న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో జరిగింది. బాధితురాలి కథనం మేరకు, ల్యూతెన్స్ ప్రాంతంలోని ఓ లాంగ్వేజ్ స్కూల్ లో పనిచేస్తున్న యువతి, లంచ్ బ్రేక్ లో భవంతి పైకి వెళ్లింది.

అదే సమయంలో పైకి ఓ అపరిచితుడు వచ్చాడు. ఆమెపై దాడికి ప్రయత్నించాడు. కిందకు వెళ్లకుండా తలుపులకు గడియపెట్టి నిలువరించాడు. బాధితురాలు భయాందోళనలతో ఉండగా, ఆమెనే తదేకంగా చూస్తూ, పాడుపని మొదలు పెట్టాడు. ఆమె కేకలు పెడుతూ ఉంటే, చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని పక్క భవంతి టెర్రెస్ పైకి దూకి పారిపోయాడు. సహోద్యోగులు సీసీటీవీ ఫుటేజ్ ని చూపించగా, నిందితుడిని గుర్తించినప్పటికీ, అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని గుర్తించే పనిలో ఉన్నారు.

cannaught place
New Delhi
Crime News
Masturbates
  • Loading...

More Telugu News