Madras IIT: మైక్రోసాఫ్ట్ రూ. 1.39 కోట్లు, ఉబెర్ రూ. 99 లక్షలు... ఐఐటీయన్లకు బంపరాఫర్!

  • భారీ ప్యాకేజీలను దగ్గర చేస్తున్న దిగ్గజ కంపెనీలు
  • మద్రాస్ ఐఐటీలో జోరుగా క్యాంపస్ ప్లేస్ మెంట్స్
  • పాల్గొన్న యాపిల్, ఐబీఎం, ఐటీసీ, శాంసంగ్

ఐఐటీ మద్రాసులో ప్రస్తుతం జరుగుతున్న క్యాంపస్‌ నియామకాల్లో దిగ్గజ కంపెనీలు విద్యార్థులకు బంపరాఫర్లు దగ్గర చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ, ఓ విద్యార్థికి రూ. 1.39 కోట్ల భారీ ప్యాకేజీని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్‌ ఓ విద్యార్థికి రూ. 99.87 లక్షల ప్యాకేజీని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరో ఐటీ దిగ్గజం యాపిల్, తొలిసారిగా, రూ.15 లక్షల ప్యాకేజీని ఇచ్చేందుకు నిర్ణయించింది. వీటితో పాటు గోల్డ్‌ మన్‌ సాక్స్‌, ఐబీఎం, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఐటీసీ, శాంసంగ్ తదితర ఎన్నో కంపెనీలు, ఈ రిక్రూట్ మెంట్ లో పాల్గొంటున్నాయి. కాగా, కంపెనీలు ఇచ్చిన భారీ ప్యాకేజీలపై అధికారిక సమాచారాన్ని మద్రాస్ ఐఐటీ ధ్రువీకరించాల్సివుంది.

Madras IIT
Campus Recruitments
Microsoft
IBM
  • Loading...

More Telugu News