turkish airlines: విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన 'వైఫై' పేరు!

  • వైఫైకి 'బాంబ్ ఆన్ బోర్డ్' అన్న పేరు పెట్టుకున్న ప్రయాణికుడు
  • విమానంలో బాంబుందని అత్యవసర ల్యాండింగ్
  • తనఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాని వైనం

ఓ వ్యక్తి తన వైఫై హాట్ స్పాట్ కి పెట్టుకున్న పేరు ఓ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన ఘటన టర్కిష్ ఎయిర్ లైన్స్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం 100 మంది ప్రయాణికులతో నైరోబీ నుంచి ఇస్తాంబుల్ బయల్దేరింది. విమానం టేకాఫ్ కు ముందు మొబైల్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టిన ఒక ప్రయాణికుడు తన హాట్ స్పాట్ ద్వారా వైఫై ఆన్ చేశాడు.

ఆ వైఫై హాట్ స్పాట్ పేరును ‘బాంబ్‌ ఆన్‌ బోర్డ్‌’ అని పెట్టుకున్నాడు. ఇది ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది మొబైల్ లో చూపించడంతో ఏటీసీని పైలట్ సంప్రదించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పర్మిషన్ అడిగాడు. అధికారులు అనుమతివ్వడంతో సూడాన్ లోని కార్టూమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశాడు. వెంటనే చుట్టుముట్టిన భద్రతా దళాలు ప్రయాణికులను దించేసి, తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో తిరిగి విమానం బయల్దేరింది. అయితే ఆ మొబైల్ వైఫై ఓనర్ ని గుర్తించారా? ఆయనపై ఏవైనా చర్యలు తీసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.  

turkish airlines
Bomb on board
wi-fi network name
Khartoum airport
emergency landing
  • Loading...

More Telugu News