rajaseakhar: నన్నందరూ వెక్కిరించేవారు.. పట్టుదలతో డాక్టర్ అయ్యాను: నటుడు రాజశేఖర్

  • చిన్నప్పుడు నత్తి ఉండేది
  •  కనీసం మా నాన్న పేరు కూడా పలకలేకపోయేవాడిని 
  • అందరూ వెక్కిరించే వారు

చిన్నతనంలో తనను అంతా వెక్కిరించే వారని ప్రముఖ నటుడు రాజశేఖర్ తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్‌ 3) పురస్కరించుకుని హైదరాబాదులోని నెక్లెస్‌ రోడ్‌ లోని పీపుల్స్‌ ప్లాజాలో దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం అవగాహన సదస్సు, వాక్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సందర్భంగా రాజశేఖర్ తన చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ, తాను కూడా వికలాంగుడినేనని చెప్పారు.

చిన్నప్పుడు తనకు నత్తి ఉండేదని ఆయన అన్నారు. కనీసం తన తండ్రి పేరు కూడా సరిగ్గా పలకలేకపోయేవాడినని ఆయన చెప్పారు. దీంతో అందరూ తనను హేళన చేసేవారని రాజశేఖర్ తెలిపారు. అయినా సరే పట్టుదలతో చదవి డాక్టర్ అయ్యానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత సినీ నటుడిగా మారానని అన్నారు. మంచి నటుడిగా పేరు కూడా తెచ్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. అంతా సమానం అన్న భావన అందర్లోనూ ఉండాలని ఆయన సూచించారు. దివ్యాంగులు నిరాశ చెందకుండా పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. తన జీవితాంతం దివ్యాంగుల కోసం చేతనైన సాయం చేస్తానని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News