José Covaco: ఇవాంకా టూర్ పై నెటిజన్ల వీడియోలు... సోషల్ మీడియాలో వైరల్.. మీరు కూడా చూడండి

  • సోషల్ మీడియాలో ఇవాంకా వీడియోలు వైరల్
  • మీడియాలో ప్రసారమైన వీడియోలకు వాయిస్ జోడించిన ఔత్సాహికులు
  • ఇవాంకా కామెడీ వీడియోను పోస్టు చేసిన కమెడియన్ జోస్ కోవాకో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ ఇటీవల జీఈఎస్-2017 నేపథ్యంలో హైదరాబాదుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ టూర్ లో ఆమె భారతీయులను ఆకట్టుకున్నారు. దీనిపై మీడియా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో ప్రసారమైన విజువల్స్ కు తెలుగు వాయిస్ ను యాడ్ చేసిన వీడియోలతో నెటిజన్లు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా కమెడియన్ జోస్ కొవాకో ట్వీట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. పెయిడ్ మీడియా వాస్తవాలు చూపించడం లేదని, వాస్తవానికి ఇండియాకు ఇవాంకా వచ్చింది ఆధార్ కార్డు కోసమని చెబుతూ ఒక వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. కొవాకో సరదగా చేసిన ఈ ట్వీట్‌ ను ఆధార్ సీరియస్‌ గా తీసుకుని, ఇవాంక ఆధార్ కోసం రాలేదని, ఆమె భారతీయ పౌరురాలు కాదని రిప్లై ఇచ్చింది. దానిని మీరు కూడా చూడండి. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News