valmiki boya reservations: చంద్రబాబు మాకు దైవంలా కనిపిస్తున్నారు: కాల్వ శ్రీనివాసులు

  • వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం
  • హర్షం వ్యక్తం చేసిన కాల్వ శ్రీనివాసులు
  • తమకు మరో పెద్ద పండుగ వచ్చిందంటూ వ్యాఖ్య

వాల్మీకి, బోయలను ఎస్టీల జాబితాలో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, దశాబ్దాల తమ కల నెరవేరిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు దేవుడిలా కనబడుతున్నారని చెప్పారు. ఈ బిల్లుతో దశాబ్దాల పాటు దోపిడీకి గురైన ఓ సామాజిక వర్గంలో సరికొత్త ఆశలు చిగురించాయని అన్నారు.

వాల్మీకి, బోయలకు వాల్మీకి జయంతి పెద్ద పండుగ అని... ఈ బిల్లుతో ఈ రోజు మరో పెద్ద పండుగ వచ్చిందని చెప్పారు. వాల్మీకి, బోయలను ఎస్టీలలో చేర్చడం వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాల్వ శ్రీనివాసులు బోయ సామాజికవర్గానికి చెందిన నేత అనే విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News