kapu resarvation: బ్రేకింగ్ న్యూస్... కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం!

  • కాపు రిజర్వేషన్ కు ఏపీ కేబినెట్ నిర్ణయం
  • 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సత్ఫలితం
  • కాపులకు 5 శాతం రిజర్వేషన్ సౌకర్యం

కాపుల 30 ఏళ్ల పోరాటం ఫలించింది. తమకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతున్న కాపుల చిరకాల వాంఛ నెరవేరింది. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ కేబినేట్ తీర్మానించింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. దీంతో ఏపీలో మొత్తం రిజర్వేషన్లు 55 శాతానికి చేరుకోనున్నాయి. కాపు రిజర్వేషన్లు బలిజ, ఒంటరి, తెలగ కులాలకు కూడా వర్తిస్తాయి. రేపు ఉదయం కేబినెట్ మరోసారి భేటీ అయి దీనిపై ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News