angelina jolie: అభిమానతారలా మారాలనుకుంది.. కురూపిలా తయారైంది.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్!

  • ఏంజెలీనా జోలీలా మారాలని భావించిన సహర్ 
  • 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది 
  • అవి విఫలం కావడంతో కురూపిలా మారింది 

ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీలా మారాలని భావించిన ఆమె వీరాభిమాని ప్రయోగం దారుణ ఫలితాన్నిచ్చిన ఘటన ఇరాన్ లో చోటుచేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మరింత అందంగా మారాలని భావించే వారు ఈమెను చూసి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు ఆమె ఫోటోలను పోస్టు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.

దాని వివరాల్లోకి వెళ్తే... ఇరాన్ కు చెందిన సహర్ తబర్ (19) ఏంజెలీనా జోలీకి వీరాభిమాని. ఆమెను విపరీతంగా అభిమానించే సహర్ ఒకరోజు ఆమెలాగే మారితే బాగుంటుందని భావించింది. దీంతో ఆమె ఒక ప్లాస్టిక్ సర్జన్ ను ఆశ్రయించింది. ఆయన ఓకే అనడంతో ప్లాస్టిక్ సర్జరీకి సిద్ధమైంది. మొత్తం 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.

అయితే ఆమె ఊహించిన విధంగా మారడంలో ఆ ప్లాస్టిక్ సర్జరీలు విఫలమయ్యాయి. దాంతో సర్జరీకి ముందు అందమైన కుందనాల బొమ్మలా ఉన్న సహర్ తబర్ ఒక్కసారిగా కురూపిగా మారిపోయింది. దీంతో తను చేసిన ప్రయోగం, ప్రయత్నాలను వివరిస్తూ తన ఫోటోలు ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఇప్పుడు ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమెలా అందం కోసం ప్రయత్నించవద్దని చెబుతూ షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె ఫోటోలు మీరు కూడా చూడండి.

angelina jolie
sahar tabar
surgeries failed
50 surgeries
  • Loading...

More Telugu News