amala paul: అజిత్ తో నటించాలని వుంది .. నా కెరియర్లో గొప్ప అవకాశంగా భావించే విషయం ఇదే!: అమలాపాల్

  • అమలాపాల్ తాజా చిత్రంగా 'తిరుట్టు పాయలే 2'
  • త్వరలో తెలుగులోను రిలీజ్ 
  • అజిత్ తో కలిసి నటించాలని వుంది 
  • ఆ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నా    

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అమలా పాల్ కి మంచి గుర్తింపు వుంది. తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గినా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. ఈ రెండు భాషల్లోను చాలామంది స్టార్ హీరోలతో ఆమె నటించింది. అయితే అజిత్ తో నటించాలనే కోరిక ఇంకా తీరలేదని చెబుతోంది.

 "అజిత్ తో నటించే అవకాశం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను .. అలాంటి ఛాన్సే వస్తే ఎంత మాత్రం వదులుకోను. అజిత్ మంచి నటుడు .. అంతకి మించి మంచి మనిషి .. ఆయన నటనన్నా .. సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. నా కెరియర్లో గొప్ప అవకాశంగా నేను భావించేది ఏదైనా వుందంటే .. అది అజిత్ తో కలిసి నటించడమే" అని చెప్పుకొచ్చింది. ఇక అమలా పాల్ తాజా చిత్రంగా 'తిరుట్టు పాయలే 2' .. ఈ రోజునే తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రసన్నా .. బాబీసింహా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది.           

amala paul
prasanna
  • Loading...

More Telugu News