polavaram: పోల‌వ‌రం అయిపోతోంద‌ని భ్ర‌మ‌లు క‌లుగజేశారు.. ఇప్పుడు ఇదేమిటి?: వైసీపీ ఆగ్ర‌హం

  • ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు?
  • పోల‌వ‌రం బాధ్య‌త తీసుకుంది చంద్ర‌బాబా? కాదా?
  • కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న‌ది మీ మిత్రులు కాదా?
  • సాకులు చెప్పి మ‌భ్య పెట్ట‌డం స‌రికాదు

పోల‌వ‌రం ప్రాజెక్టుపై వ‌స్తోన్న అభ్యంత‌రాల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ రోజు హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు. అనంత‌రం స‌ద‌రు నేత‌లు మీడియాతో మాట్లాడుతూ... వారం రోజుల క్రితమే అన్ని పనులూ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని అన్నారని, ఇప్పుడు మాట మార్చి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని ఓ నెపాన్ని కేంద్ర ప్ర‌భుత్వంపై నెట్టాల‌ని చూస్తున్నారా? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు అభివృద్ధికి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అడ్డుప‌డుతున్నార‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తెలిపారు. నిన్నటి నుంచి అసెంబ్లీలో మాట్లాడుతోన్న ధోర‌ణి చూస్తే పోల‌వ‌రం ప్రాజెక్టు ముందుకు క‌దులుతుందా? అన్న ఆందోళ‌న నెల‌కొంద‌ని తెలిపారు. విభ‌జ‌న త‌రువాత ఏపీ న‌ష్ట‌పోయే ప‌రిస్థితులు ఉన్నాయని, టీడీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌తతో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. పోల‌వ‌రంపై జాప్య‌త‌.. స‌హించ‌రాని విష‌యమ‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మీద సాకులు చెప్పి త‌ప్పించుకోవ‌ద్దని సూచించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబు లైట్ తీసుకున్నార‌ని విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు పోల‌వ‌రాన్ని ద‌గ్గ‌రుండి నీరుగారుస్తున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం బాధ్య‌త తీసుకుంది చంద్ర‌బాబా? కాదా? అని నిల‌దీశారు. కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న‌ది మీ మిత్రులే క‌దా? అని అడిగారు. సాకులు చెప్పి మ‌భ్యపెట్ట‌డం స‌రికాదని అన్నారు. వారం రోజుల ముందే పోల‌వ‌రం అయిపోతోంద‌ని భ్ర‌మ‌లు క‌లుగజేశారని వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

  • Loading...

More Telugu News