rana: 'మరకతమణి' దర్శకుడి ద్విభాషా చిత్రం .. హీరోగా రానా?

  • వరుస సక్సెస్ లతో రానా 
  • కంటెంట్ కొత్తగా ఉంటే చాలు .. ఓకే 
  • శరవణన్ కి గ్రీన్ సిగ్నల్
  • నిర్మాతగా ఎ. ఎమ్. రత్నం 

'బాహుబలి'తో వచ్చిన క్రేజ్ తో రానా దూసుకుపోతున్నాడు. సోలో హీరోగా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నాడు. అలా ఆయన ఇప్పటికే 'ఘాజీ' .. 'నేనే రాజు నేనే మంత్రి'తో విజయాలను అందుకున్నాడు. నటన పరంగాను తనలో కొత్త కోణాన్ని చూపించాడు. కొత్తదనం కలిగిన కంటెంట్ అనిపిస్తే చాలు .. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.

అలా తాజాగా ఆయన దర్శకుడు ఏ.ఆర్.కె. శరవణన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన 'మరకతమణి' అనే సినిమా తెలుగు .. తమిళ భాషా ప్రేక్షకులను ఇటీవలే పలకరించింది. ఆయన వినిపించిన కథ ఒకటి బాగా నచ్చేయడంతో, తప్పకుండా చేద్దామని రానా మాట ఇచ్చాడట. ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రానా ఇంతకుముందు కమిటైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. అవి పూర్తి కాగానే .. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు.  

rana
sharavanan
  • Loading...

More Telugu News