surya: సూర్య 'గ్యాంగ్' టీజర్ అదుర్స్ .. 12 గంటల్లో 25 లక్షల వ్యూస్!

  • సూర్య తాజా చిత్రంగా 'తానా సెరిందా కూట్టమ్'
  • తెలుగులోకి 'గ్యాంగ్' టైటిల్ తో 
  • టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ 
  • సంక్రాంతికి సినిమా రిలీజ్      

సూర్య తాజా చిత్రంగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'తానా సెరిందా కూట్టమ్' తెరకెక్కింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, తెలుగులో 'గ్యాంగ్' పేరుతో విడుదల చేయనున్నారు. తమిళ సినిమా నుంచి నిన్న సాయంత్రం వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. కేవలం 12 గంటల్లో ఈ టీజర్ కి 25 లక్షల వ్యూస్ రావడంతో, ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది.

మాస్ లుక్ తోను .. క్లాస్ లుక్ తోను ఈ టీజర్ లో సూర్య కనిపిస్తూ ఉండటం విశేషం. ముఖ్యమైన పాత్రల్లో రమ్యకృష్ణ .. కార్తీక్ కనిపిస్తున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ .. సందడిగా కొనసాగింది. బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'స్పెషల్ చబ్బీస్' సినిమాకి ఇది రీమేక్. అనిరుథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా రెండు భాషల్లోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.    

  • Loading...

More Telugu News