Virat Kohli: ప్రపంచ రికార్డు ముంగిట కోహ్లీ.. మూడో టెస్ట్ గెలిస్తే ఆస్ట్రేలియా సరసన భారత్!

  • ఢిల్లీ టెస్టు గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు
  • వరుసగా 9 టెస్ట్ సిరీస్ విజయాలతో ఆసీస్‌ను సమం చేయనున్న కోహ్లీ సేన
  • 5 వేల పరుగులకు మరో 25 పరుగుల దూరంలో కోహ్లీ

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును బద్దలుగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో రేపు శ్రీలంకతో చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టును కనుక కోహ్లీ సేన గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఈ విజయంతో భారత్ వరుసగా 9 టెస్ట్ సిరీస్‌లను సొంతం చేసుకున్న జట్టుగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుంది. వరుసగా 9 టెస్ట్ సిరీస్‌లను సాధించిన రికార్డు ఇప్పటి వరకు ఆసీస్ పేరుపై ఉంది. ఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఆసీస్ రికార్డును సమం చేస్తుంది. 2005-08లో ఆసీస్ వరుసగా 9 టెస్ట్ సిరీస్‌లను సొంతం చేసుకుంది.

శ్రీలంకతో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. సఫారీలతో జరిగే టెస్ట్ సిరీస్‌లో కనుక టీమిండియా విజయం సాధిస్తే వరుసగా పది టెస్ట్ సిరీస్‌లు గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంటుంది.  

స్కిప్పర్ కోహ్లీ ఖాతాలోనూ మరో అరుదైన రికార్డు వచ్చి చేరబోతోంది. మరో 25 పరుగులు చేస్తే టెస్టుల్లో కోహ్లీ 5 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న 11వ ఆటగాడు అవుతాడు. ఇప్పటి వరకు 62 టెస్టుల్లో 104 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 4,975 పరుగులు సాధించాడు.

  • Loading...

More Telugu News