kerala: శబరిమల భక్తులకు తుపాను హెచ్చరిక.. ఆలయం తాత్కాలికంగా మూసివేత!

  • శబరిమల వెళ్లే రహదారులను మూసివేసిన అధికారులు
  • గురువారం సాయంత్రం నుంచి నేటి ఉదయం వరకు అయ్యప్ప దర్శనం నిలిపివేత
  • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భక్తులకు హెచ్చరికలు

శబరిమల భక్తులకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంక సమీపంలో తీరం దాటిన వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి గురువారం మధ్యాహ్నానానికి కేరళ తీరానికి సమీపంలో కేంద్రీకృతమైంది. దీనికి ‘ఒఖీ’ అని నామకరణం చేశారు. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా లక్షద్వీప్ దీవుల దిశగా పయనించి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, శబరిమల వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
 
డిసెంబరు 5 నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ఈ వాయుగుండం ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుపాను ప్రభావం కారణంగా శబరిమల వెళ్లే రహదారులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు అయ్యప్పస్వామి దర్శనాన్ని నిలిపివేశారు. సన్నిధానం, పంబ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ మార్గం మీదుగా రాకపోకలు నిషేధించారు. చెట్ల కింద, పల్లపు ప్రాంతాల్లో బస చేయవద్దని భక్తులకు సూచించారు. వర్షం కారణంగా తిరుమల భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు.   

  • Loading...

More Telugu News