aiadmk: ఆర్కేనగర్‌లో అన్నాడీఎంకే అభ్యర్థి ఖరారు.. మధుసూదన్ కే టికెట్!

  • అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్ ఖరారు
  • టికెట్ కోసం పోటీ పడ్డ 19 మంది
  • పన్నీర్ సెల్వంకు మధుసూదన్ నమ్మకస్తుడు

చర్చోపచర్చల అనంతరం చెన్నైలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికకు గాను అన్నాడీఎంకే తన అభ్యర్థిని ఖరారు చేసింది. పన్నీర్ సెల్వం నమ్మకస్తుడు, పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ ను బరిలోకి దింపినట్టు అన్నాడీఎంకే ప్రకటించింది. అభ్యర్థిని ఎంపిక చేసే క్రమంలో పార్టీలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారు ముందుకు రావాలంటూ పార్టీ హైకమాండ్ కోరింది. ఈ నేపథ్యంలో, మధుసూదన్ సహా 19 మంది తమ దరఖాస్తులను సమర్పించారు. వీరిలో నుంచి మధుసూదన్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్ కు ఉప ఎన్నిక జరుగుతోంది. అసలు గత ఏప్రిల్ లో జరగాల్సిన ఈ ఎన్నికను పోలింగుకు ముందు, ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెడుతున్నారంటూ పలు ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇప్పుడు డిసెంబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. 24వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.

aiadmk
panner selvam
  • Loading...

More Telugu News