alia bhatt: 'సాహో'ను అలియాభట్ అందుకే వదులుకుందట!

  • నటనకి అవకాశం వుండే పాత్రలను ఎంచుకుంటున్నాను 
  • 'సాహో'లో గ్లామరస్ పాత్ర కోసం అడిగారు 
  • అందువల్లనే ఆలోచనలో పడ్డాను 
  • బాలీవుడ్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నాను      

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం చాలామంది కథానాయికలను సంప్రదించారు. ఆ జాబితాలో అలియాభట్ కూడా వుంది. అయితే ఈ సినిమాలో చేయడానికి ఆమె అంతగా ఆసక్తిని చూపలేదు. తాజా ఇంటర్వ్యూలో అందుకు గల కారణాన్ని ఆమె ప్రస్తావించింది.

 " 'సాహో' కోసం నన్ను అడిగారు .. భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారు. అయితే ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నీ నటనకు ప్రాధాన్యత వున్నవే. ప్రస్తుతం సెట్స్ పై వున్న సినిమాల్లోను నటనకు ఎక్కువ స్కోప్ వున్న పాత్రలే చేస్తున్నాను. 'సాహో' సినిమాలో పాత్ర పరంగా గ్లామరస్ గా కనిపించవలసి ఉంటుంది ..అంతే. అందువలన కుటుంబ సభ్యులందరితో మాట్లాడి .. బాలీవుడ్ సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాలని భావించి, ఈ సినిమాను వదులుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలోనూ కథానాయిక పాత్ర నటనకి అవకాశం వున్నదేననీ, ఈ సినిమా తరువాత శ్రద్ధా కపూర్ క్రేజ్ మరింత పెరుగుతుందనేది 'సాహో' టీమ్ చెబుతోన్న మాట.   

alia bhatt
shraddha kapoor
  • Loading...

More Telugu News