ivanka trump: అమెరికా బయల్దేరిన ఇవాంకా ట్రంప్.. హైదరాబాద్ గురించి ఏం చెప్పారంటే..!

  • ముగిసిన ఇవాంకా హైదరాబాద్ పర్యటన
  • గోల్కొండను సందర్శించడంపై ఆనందం
  • పరిపూర్ణ ముగింపు అంటూ ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. నగరంలో జరిగిన జీఈఎస్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆమె... రెండు రోజుల పాటు హైదరాబాదులో సందడి చేశారు. ఫలక్ నుమా ప్యాలస్ లో ఇచ్చిన విందుకు హాజరైన ఆమె... చారిత్రక గోల్కొండ కోటను కూడా సందర్శించారు. ఎంతో నిరాడంబరంగా గడిపిన ఆమె... అందరి మనసులను ఆకట్టుకున్నారు.

హైదరాబాద్ పర్యటన ముగిసిన వెంటనే ఆమె ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. హైదరాబాద్ పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరిగి బయలుదేరే ముందు తమ ప్రతినిధులతో కలసి గోల్కొండ కోటను సందర్శించానని... అద్భుతమైన ఈ పర్యటనకు ఇది పరిపూర్ణ ముగింపు అని ఆమె ట్వీట్ చేశారు.

ivanka trump
  • Loading...

More Telugu News