vishal: ఆర్యకి పెళ్లికాలేదు... ముందు వాడికి చెయ్యాలి!: విశాల్

  • నడిగర్ సంఘం బిల్డింగ్ చెన్నైకి తలమానికంగా ఉండేలా నిర్మిస్తాం
  • పని మొదలు పెడితే పూర్తయ్యేంతవరకు వదలను
  • కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్, ఇతర సౌకర్యాలు

నడిగర్ సంఘానికి సంబంధించిన బిల్డింగ్ ను చెన్నైకి ఐకానిక్ బిల్డింగ్ గా నిర్మించే ప్రయత్నంలో ఉన్నామని విశాల్ తెలిపాడు. వివిధ విషయాలపై ఈ రోజు ఓ టీవీ ఛానెల్ తో విశాల్ మాట్లాడుతూ, ఏదైనా సమస్య ఉందని తెలిస్తే దానిపై కచ్చితంగా తాను గొంతెత్తుతానని అన్నాడు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టిన తరువాత మధ్యలో వైదొలగడం చేతకాదని చెప్పాడు. చాలా కాలంగా నడిగర్ సంఘంకు ఓ బిల్డింగ్ నిర్మించాలని అందరూ భావించారని, అయితే పూర్తి చేయలేకపోయారని, అందుకే తాను నడిగర్ సంఘం ఎన్నికల్లోకి దిగాల్సి వచ్చిందని తెలిపాడు.

ఇక కట్టబోయే ఆ బిల్డింగ్ చెన్నైకి తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని విశాల్ చెప్పాడు. అందులో ఒక పెద్ద కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పాడు. దానిని మీ వివాహంతోనే ఆరంభిస్తారా? అని అడగగా... 'లేదు లేదు, ఆర్యకి ఇంకా పెళ్లి కాలేదు...ముందు వాడికి పెళ్లి చెయ్యాలి' అని విశాల్ నవ్వుతూ చెప్పాడు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News